ప్ర: కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలేంటి?
జ: కరోనా తగ్గుముఖం పడుతోంది, వైరస్ వ్యాప్తి నివారించుకోవచ్చు అనే సమయంలో మర్కజ్ కేసులు రావడం వల్ల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో 90 శాతం కేసులు తబ్లీగీ జమాతేకు సంబంధించినవే. అన్ని రాష్ట్రాలు కూడా ఐకమత్యంతో పనిచేస్తున్నాయి. లాక్డౌన్ పొడిగింపు విషయం ఈ రోజు కానీ, రేపు కానీ ప్రధాని ప్రకటించనున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన జిల్లాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసేలా రాష్ట్రాలకు ఆజమాయిషీ ఇచ్చి కేంద్రం పర్యవేక్షించనుంది.
ప్ర: వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు రాష్ట్రాల సహకారం ఎలా ఉంది?
జ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఒక్క పశ్చిమ బంగా ప్రభుత్వం మాత్రమే హెల్త్ బులెటిన్ విడుదల చేయకుండా, కొవిడ్ మరణాలను సహజ మరణాల కింద చూపిస్తూ సమస్యను పక్కదారి పట్టించాలని చూస్తోంది.
ప్ర: లాక్డౌన్ పొడిగింపు విషయంలో ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొడిగించే, ముగిసే సమయానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది?
జ: ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తీసుకున్నాం. జాయింట్ సెక్రటరీస్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసినా తీసుకోవాల్సిన చర్యలపై ముసాయిదాను తయారు చేశారు. దానిపైనా శనివారం నాడు చర్చించాం. ఇంకా సమయం ఉన్నందున ఇంకా కొన్ని అంశాల్లో మార్పు చేర్పులు చేయనున్నాం.