Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు జవాబిచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థికసంఘం ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచిందని వెల్లడించారు. అలాగే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించిందని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఆ సిఫారసులను కొనసాగించిందని వివరించారు. విభజన చట్టం ప్రకారం ఇచ్చిన ఇతర హామీలను చాలావరకు నెరవేర్చామన్న నిత్యానందరాయ్.. కొన్ని మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారానికి 28 సమావేశాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. హామీలు చాలా వరకు నెరవేర్చాం: కేంద్రం
Central Govt on AP Special Status: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి పాత మాటే చెప్పింది. హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మరోసారి లోక్‌సభకు తెలిపింది. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చామన్న హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్..హామీల్లో కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం