New Districts: కొత్త జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు జారీ - కొత్త జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు న్యూస్
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు జారీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ప్రభుత్వాలను మ్యాపింగ్ చేసేందుకు వీలుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ ఎల్‌జీడీ కోడ్లను జారీ చేసింది.
కొత్త జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు జారీ
By
Published : Apr 6, 2022, 5:15 PM IST
కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్లను జారీ చేసింది. స్థానిక ప్రభుత్వాలను మ్యాపింగ్ చేసేందుకు వీలుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ ఎల్‌జీడీ కోడ్లను జారీ చేస్తుంది. జనగణన నుంచి వివిధ ప్రభుత్వ పథకాల వరకూ ఎల్‌జీడీ కోడ్ ద్వారానే కార్యక్రమాల అమలును కేంద్రం పర్యవేక్షిస్తుంది. భౌగోళిక ప్రాంతాలు, రెవెన్యూ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాలను కూడా లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్ ద్వారానే ప్రభుత్వం మ్యాపింగ్ చేస్తోంది.
జిల్లా
ఎల్‌జీడీ కోడ్
మన్యం
743
అనకాపల్లి
744
అల్లూరి
745
కాకినాడ
746
కోనసీమ
747
ఏలూరు
748
ఎన్టీఆర్
749
బాపట్ల
750
పల్నాడు
751
తిరుపతి
752
అన్నమయ్య
753
శ్రీసత్యసాయి
754
నంద్యాల
755
ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికే 502 నుంచి 521 వరకూ జిల్లా లోకల్ గవర్నమెంట్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇకపైనా అవే నెంబర్లును ఆయా జిల్లాలకు కొనసాగించనున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలతో దేశంలో మెుత్తం జిల్లాల సంఖ్య 755కు చేరింది.