ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం.. అందులో పాల్గొనాలని విజ్ఞప్తి - ఏపీ తాజా వార్తలు

Azadi Ka Amrit Mahotsav: "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" ఉత్సవాల జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 6న దిల్లీ వెళ్లనున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది.

Central Invite CBN
Central Invite CBN

By

Published : Aug 1, 2022, 12:15 PM IST

Central Invite CBN: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాల జాతీయ కమిటీ(national meeting of azadi ka amrit mahotsav ) సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబును(chandrababu) కేంద్రం ఆహ్వానించింది. ఈ మేరకు ఆయన ఈ నెల 6వ తేదీన దిల్లీ వెళ్లనున్నారు.(azadi ka amrit mahotsav) ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్​లో ఈ సమావేశం జరగనుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details