ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా 22% పెంపు - ఆక్సిజన్‌ కేటాయింపు తాజా వార్తలు

రాష్ట్రాలకు సగటున 8% ఆక్సిజన్‌ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

increased the 8 percentage of oxygen
రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా 22% పెంపు

By

Published : Apr 22, 2021, 6:49 AM IST

కేంద్ర ప్రభుత్వం అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలకు సగటున 8% ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచింది. ఇందులో రాష్ట్రానికి కోటా 22% పెరిగింది. ఆక్సిజన్‌ కొరతతో దిల్లీ, ముంబయిలాంటి చోట్ల రోగుల ప్రాణాలు పోతుండటం, ఆసుపత్రులు నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో కేంద్రం ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, హరియణా, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీలకు ఆక్సిజన్‌ కేటాయింపును 3,945 మెట్రిక్‌ టన్నుల నుంచి 4,278 మెట్రిక్‌ టన్నులకు పెంచింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇదివరకు 360 మెట్రిక్‌ టన్నులు కేటాయించగా ఇప్పుడు 440 మెట్రిక్‌ టన్నులకు పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details