కరోనా ముూడో వేవ్ దృష్ట్యా రాష్ట్రానికి రూ.696.52 కోట్ల ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. ప్రాజెక్టు గ్రాంటుగా కేంద్రం రూ.417.91 కోట్లు ఇవ్వనుంది. 14 జిల్లా, 12 బోధన ఆస్పత్రుల్లో 41 పడకల చొప్పున ఏర్పాటు చేయనుంది. పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం..ఈ యూనిట్లకు రూ. 101 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది.
విజయవాడలో రూ.5 కోట్లతో పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 208 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 20 పడకల చొప్పున ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 176 గ్రామీణ, 355 పట్టణ పీహెచ్‌సీలు, 230 ఉపకేంద్రాల్లో 6 పడకల చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నిర్వహణ వ్యవస్థను బోధన, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయటంతో పాటు.. మూడో వేవ్‌లో కోటి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.