ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనానూ వదలని సైబర్​ నేరగాళ్ళు.. సమాచారం పేరిట డేటా చోరీ! - సెర్బెరస్

కరోనా సమాచారం పేరిట సైబర్​ నేరస్థులు ఆర్థిక డేటాను కొట్టేస్తారని ఇంటర్​పోల్ హెచ్చరించింది. కొవిడ్ సమాచారం అందిస్తామనే సాకుతో ట్రోజాన్​ను లింక్​ల ద్వారా పంపిస్తారని పేర్కొంది.

central-bureau-of-investigation
కరోనా సమాచారం పేరుతో సైబర్​ చోరీలు

By

Published : May 20, 2020, 12:44 PM IST

కరోనా గురించి సమాచారం పేరుతో సైబర్‌ దాడులు జరిగే అవకాశముందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. పోలీస్‌ విభాగాల్ని అప్రమత్తం చేసింది. సైబర్‌ నేరస్థులు ‘సెర్బెరస్‌’ అనే బ్యాంకింగ్‌ ట్రోజాన్‌ను చరవాణుల్లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇంటర్‌పోల్‌ పేర్కొంది.

కొవిడ్‌ గురించి అప్‌డేట్‌ సమాచారం అందజేస్తామనే సాకుతో ఈ ట్రోజాన్‌ను మాలిషియస్‌ లింక్‌ల ద్వారా పంపిస్తారని హెచ్చరించింది. ఒకవేళ ఆ లింక్‌లను చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే క్రెడిట్‌, డెబిట్‌కార్డుల నుంచి ఆర్థిక డేటాను దొంగిలించి డబ్బులు కొట్టేస్తారని హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details