రాష్ట్ర అభివృద్ది పట్ల కేంద్రం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై పోరాడాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాయితీ ఇస్తానని పక్కదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలకు, మైనారిటీలకు గొడ్డలిపెట్టుగా మారిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీల విషయంలో జగన్మోహన్‌రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జగన్‌ని కోరితే...పార్లమెంట్‌లో బిల్లుపై భాజపాకి మద్దతిచ్చి బయట మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
'ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీయండి' - జగన్ పై మండిపడ్డ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ రెడ్డి
ప్రత్యేక హోదా విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాడాలని ముఖ్యమంత్రి జగన్‌కి సూచించారు.

పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ రెడ్డి
వైకాపాపై పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ రెడ్డి విమర్శలు
ఇదీ చదవండి: