మే నెల తొలి 15 రోజులకు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2.12 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవిషీల్డ్ 1.62 కోట్లు కాగా, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ టీకా డోసులు 50 లక్షలు ఉన్నాయి. రాష్ట్రానికి 9,17,850, తెలంగాణకు 8,35,960 డోసులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ 9, తెలంగాణ 12వ స్థానాల్లో నిలిచాయి.
52 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు..
ఆదివారం నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రానికి 73 వేలు, తెలంగాణకు 52 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి సదానందగౌడ్... శనివారం తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్ 21 నుంచి మే 1వ తేదీ వరకు ఏపీకి 69,100, తెలంగాణకు 41,800 ఇంజక్షన్లను అందించినట్లు గుర్తుచేశారు.