ఇటుక బదులు ప్లాస్టిక్... పర్యావరణ పరిరక్షణకు ఇదో ట్రిక్! - sri durga malleshwara sidhartha mahila college
నిర్మాణాల్లో ఇటుక బదులు ప్లాస్టిక్ వాడకాన్ని ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇదెలా సాధ్యమన్న ఆలోచన వస్తే.. విజయవాడలోని ఈ కళాశాల సిబ్బంది, విద్యార్థులు చేసిన మంచి ప్రయత్నాన్ని తెలుసుకోండి.
పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్‌తో.. వినూత్న ప్రయోగం చేశారు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు. కళాశాల ఆవరణలో, క్యాంటీన్లో పడి ఉన్న ప్లాస్టిక్ సీసాలు సేకరించి.. సిమెంట్ బల్లలు తయారు చేశారు. ఇటుక బదులు ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించారు. వాటిలో ఇసుక నింపి నిర్మాణానికి వినియోగించి మంచి ఫలితాన్ని సాధించారు. త్వరలోనే చెప్పుల స్టాండ్లు తయారు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న నిర్మాణాలకు ప్లాస్టిక్ వినియోగిస్తే ఖర్చు తక్కువ అవుతుందని.. పర్యావరణానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని పంచుతున్నారీ విద్యార్థులు.