Easter Wishes: రాష్ట్రంలో ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు పలువురు ప్రముఖలు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం జగన్: సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజున అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని జగన్ కోరుకున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు:ఈస్టర్ పవిత్ర దినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈస్టర్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, అహింసా మార్గంలో మానవాళి యావత్తూ నడుచుకోవాలని, క్రీస్తు చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
లోకేష్: మంచిపై కుట్రలు, దౌర్జన్యం చేసి పొందే గెలుపు మూన్నాళ్లే ఉంటుందనే సందేశాన్ని సమాజానికి అందించడానికి శుక్రవారం ప్రాణత్యాగం చేసిన క్రీస్తు, మూడో రోజే సమాధి నుంచి సజీవుడై తిరిగివచ్చారని లోకేష్ అన్నారు. తుది విజయమెప్పుడూ సత్యానిదేనని చాటి చెప్పారని తెలిపారు.
ఇదీ చదవండి:ఆర్టీసీ స్థలాల లీజుకు స్పందన కరవు.. 30 స్థలాలకు టెండర్లు పిలిస్తే.. ఒక్క చోటే..!