సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తన ఫేస్బుక్లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకు సుమోటోగా కేసు స్వీకరించిన పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
కత్తి మహేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించిన అనంతరం... వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా, కరోనా పరీక్షల కోసం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ 153 (ఏ) కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు... రిమాండ్ కు తరలించారు.