CCS Elections in RTC : ఆర్టీసీలో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ- సీసీఎస్ పాలకవర్గం కోసం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న 52వేల 100 మంది 13 జిల్లాల్లో 210 డెలిగేట్లను ఎన్నుకోనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి జరుగుతున్న ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
CCS ELECTIONS IN RTC : రేపు ఆర్టీసీలో సీసీఎస్ పాలకవర్గ ఎన్నికలు...ఏర్పాట్లు సిద్ధం - Elections in RTC
CCS Elections in RTC : రేపు ఆర్టీసీలో జరిగే సీసీఎస్ పాలకవర్గ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి జరుగుతున్న ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
రేపు ఆర్టీసీలో సీసీఎస్ పాలకవర్గ ఎన్నికలు
గతంలో ఆర్టీసీలో రెండేళ్లకోసారి గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరిగేవి. ప్రభుత్వంలో సంస్థ విలీనంతో ఆ ఎన్నికలకు వీల్లేదు. దీనివల్ల సీసీఎస్ ఎన్నికల్లో గెలుపుపై అన్ని ప్రధాన సంఘాలు దృష్టి పెట్టాయి. ఎన్నడూ లేనివిధంగా ఈసారి పొత్తులు కుదరటంతో ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది.
ఇదీచదవండి.