ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల కోసం తెదేపా రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత చంద్రబాబు శ్రేణులకు సూచించారు. గెలిపిస్తే ఊరికేం చేస్తారో వివరిస్తూ ప్రజల్ని మెప్పించాలన్నారు. పల్లె ప్రగతి-పంచసూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయాలని ఆదేశించారు.

తెదేపా అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తెదేపా అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

By

Published : Jan 28, 2021, 8:33 PM IST

పంచాయతీ ఎన్నికల కోసం తెదేపా రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత చంద్రబాబు శ్రేణులకు సూచించారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరిగే డివిజన్​లలోని పార్టీనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... పల్లె ప్రగతి-పంచసూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయాలని ఆదేశించారు.

"తెదేపా హయాంలో జరిగిన అయిదేళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గెలిపిస్తే ఊరికేం చేస్తారో వివరిస్తూ ప్రజల్ని మెప్పించాలి. ఎక్కడ ఎలాంటి ఘర్షణలు తలెత్తినా పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. 24గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఇప్పటికే ఏర్పాటు చేశాం. కాల్ సెంటర్ నెంబర్ 7306299999కు ఫిర్యాదులు తెలపాలి. ఫోటో, వీడియో సాక్ష్యాలను వాట్సప్ నెంబర్ 7557557744 కు పంపాలి. సలహాలు సూచనలు ఇచ్చేందుకు పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు అందుబాటులో ఉంటారు." -చంద్రబాబు

అన్ని స్థానాల్లో నామినేషన్లు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.

ఇదీచదవండి

వైకాపా సర్కార్​ విధానాలపై కేంద్రం జోక్యం కోరుతాం: తెదేపా ఎంపీలు

ABOUT THE AUTHOR

...view details