రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) ప్రక్రియ దుర్మార్గంగా సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఏకగ్రీవాలు పెరిగాయన్నారు. పలుచోట్ల బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందని ఆరోపించారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు (unanimous) చేసుకున్నారని ఆక్షేపించారు. అభ్యర్థులు కోర్టుకు (Courts) వెళ్తే..మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని హెచ్చరించారు. నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు ఫోర్జరీ (Signatures forgery) చేశారని.. న్యాయస్థానంలో తేలిందన్నారు. ఈ మేరకు తిరుపతిలో స్థానిక ఎన్నికల్లో జరిగిన నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియలో తేలిన ఫోర్జరీ సంతకం వ్యవహారాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టారు. దీనికి ఆర్వోలు (RO's) బాధ్యత వహించి విధుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో (CM jagan) సిద్ధహస్తుడని కోర్టులు చెప్తున్నాయని దుయ్యబట్టారు. ఫోర్జరీ సంతకాలకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి జగన్ పదవి నుంచి వైదొలగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఏకగ్రీవాలు పెరిగాయి. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే.. సీఎం, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. నామినేషన్ ఉపసంహరణ పత్రంపై చేసిన సంతకాలు ఫోర్జరీ అని తేలింది. ఫేక్ ముఖ్యమంత్రి.. ఫేక్ సంతకాలతోనే తనవారిని గెలిపించుకున్నారు. -చంద్రబాబు, తెదేపా అధినేత
జగన్ను మేలుకొల్పేందుకు...