ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా.. తెదేపాకు అండగా నిలవాలి: చంద్రబాబు

CBN Launch TDP Membership: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదుపై రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం వాట్సప్​ నెంబర్​ ప్రకటించారు.

CBN launched TDP membership
CBN launched TDP membership

By

Published : Apr 21, 2022, 12:39 PM IST

Updated : Apr 21, 2022, 1:50 PM IST

తెదేపా సభ్యత్వ నమోదు.. ప్రారంభించిన చంద్రబాబు...

CBN Launch TDP Membership: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.సభ్యత్వ నమోదుపై రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. ఉండవల్లి గ్రామ పార్టీ నేతల ద్వారా చంద్రబాబు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వాట్స్ యాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ ద్వారా సభ్యత్వం పొందే అవకాశం కల్పించారు. చంద్రబాబు పార్టీకి ఆన్​లైన్​లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. వేదికపైనే అచ్చెన్నాయుడు, నారా లోకేశ్​లు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఆన్​లైన్​లో సభ్యత్వ నమోదు చేపట్టారు. 100 రూపాయలు చెల్లింపు ద్వారా పార్టీ సభ్యత్వం పొందే అవకాశమిచ్చారు. సభ్యత్వం కార్డు పొందిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం కల్పించింది.

"రాష్ట్రాన్ని పుననిర్మాణం చేయాలనుకునేవారు పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. తటస్థులు సభ్యత్వం తీసుకోకున్నా తెదేపా సంకల్పానికి అండగా నిలవాలి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా అండగా నిలవాలి. తటస్థులు, మేధావులు కూడా తెదేపా అండగా నిలవాల్సి ఉంది. తెలుగుదేశం తొలిసారిగా అండమాన్ శాఖను అధికారికంగా గుర్తించింది. అండమాన్‌లో పార్టీ నేతలు పసుపు జెండా ఎగిరేలా చేస్తున్నారు." -నారా చంద్రబాబు నాయుడు

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఏపార్టీ చేయలేనంత సాంకేతికతతో సభ్యత్వ నమోదును చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా సభ్యత్వ యాప్​లో పార్టీ సభ్యత్వ నమోదును ఏ విధంగా నమోదు చేసుకునే అవకాశాలున్నాయో లోకేశ్ వివరించారు. వాట్సప్ నెంబరును తెలిపారు.

రాష్ట్రాన్ని పుననిర్మాణం చేయాలనుకునేవారు సభ్యత్వం తీసుకోవాలి

"వాట్సప్‌, టెలిగ్రామ్‌ ఫార్మాట్‌లో పార్టీ సభ్యత్వం నమోదు చేస్తున్నాం. వాట్సప్‌లో 9858175175 ద్వారా సభ్యత్వం తీసుకోవచ్చు. మన టీడీపీ యాప్​ను డౌన్‌లోడ్‌ చేసుకుని సభ్యత్వం తీసుకోవచ్చు. ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు అండగా ఉంటున్నాం" -నారా లోకేశ్‌

రాష్ట్రాన్ని పుననిర్మాణం చేయాలనుకునేవారు పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా అండగా నిలవాలని కోరారు. తెదేపా అండమాన్ శాఖ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. తెలుగుదేశం తొలిసారిగా అండమాన్ శాఖను అధికారికంగా గుర్తించిందని తెలిపారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు

Last Updated : Apr 21, 2022, 1:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details