ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు - CBN on Sangam Incident

CBN on Sangam Incident: జగన్​ అసమర్థత పాలనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మానవత్వం లేని భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.

CBN on Sangam Incident
CBN on Sangam Incident

By

Published : May 5, 2022, 1:03 PM IST

CBN on Sangam Incident: రాష్ట్రంలో మానవత్వం లేని భయానక పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా సంగంలో ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం దురదృష్టకరమన్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు వరుస సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరమన్నారు.హృదయం లేని జగన్ రెడ్డి పరిపాలనలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయని ట్విట్టర్​లో చంద్రబాబు దుయ్యబట్టారు.

CBN on Sangam Incident

ABOUT THE AUTHOR

...view details