దేవినేని ఉమా కాన్వాయ్‌ను అడ్డుకోవడం హేయమని చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హింసించి ఆనందించటం జగన్ కు పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "అక్రమ కేసులో అరెస్టై.. బెయిల్‌పై తిరిగివస్తున్న దేవినేని ఉమా కాన్వాయ్‌ను అడ్డుకోవటం దుర్మార్గం" అన్నారు. ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలపడమేంటని పోలీసులను ప్రశ్నించారు. హనుమాన్ జంక్షన్ వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో దేవినేని పూజలు నిర్వహిస్తారని తెలిసి పోలీసులే దగ్గరుండి గుడికి తాళాలు వేయించటం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. చట్టాన్ని అధికార పక్షం చుట్టంలా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.
వాహనశ్రేణిని అడ్డుకోవటం దుర్మార్గం
బెయిల్‌పై విడుదలైన దేవినేని ఉమా వాహనశ్రేణిని పోలీసులు అడ్డుకోవటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పౌర స్వేచ్ఛ లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా అవినీతిని తెదేపా నేతలు ప్రశ్నిస్తుంటే..జగన్ అండ్ కో కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనంగా పోలీసులే రోడ్డుపై వాహనాలు అడ్డుగా పెట్టారన్నారు. ఇకనైనా జగన్ తన తప్పుడు విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు.
'మీరు ఎలా వెళ్లారో మరిచారా ?'