ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముస్లింలను వైకాపా ఓటు బ్యాంకుగానే చూస్తోంది: చంద్రబాబు - ముస్లింలపై చంద్రబాబు కామెంట్స్

వైకాపా ప్రభుత్వం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొండంత ప్రచారం చేసి ముస్లింలకు గోరంత సాయం కూడా చేయలేదని దుయ్యబట్టారు. రంజాన్ సందర్భంగా మతపెద్దలు, ముస్లిం సోదరులతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు... వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

cbn comments  on muslims over ramadan
వైకాపా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది

By

Published : May 14, 2021, 8:21 PM IST

ముస్లింల అభివృద్ధిని సీఎం జగన్‌ గాలికొదిలేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆక్షేపించారు. రంజాన్ సందర్భంగా... ముస్లిం మతపెద్దలు, ముస్లిం సోదరులతో ఆన్​లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు... వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతం చేయటంతో పాటు ఇమామ్​లకు ఇచ్చే గౌరవ వేతనం, పెళ్లి కానుక రద్దు చేశారని ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో ముస్లింల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ప్రజల ప్రాణాలు కాపాడకుండా ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ఎండకట్టిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ప్రభాకర్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.

ABOUT THE AUTHOR

...view details