తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను జమైకాలో వినూత్నంగా నిర్వహించారు. బహమాస్, జమైకా దీవుల మధ్య ప్రపంచంలోనే అతి పెద్ద ఓడల్లో ఒకటైన రాయల్ కరీబీయన్ వారి హార్మొనీ ఆఫ్ ది షిప్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సముద్రం మధ్యలో మన్నవ మోహన్ కృష్ణ కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఏపీని కాపాడే సమర్థవంతమైన నేత చంద్రబాబు మాత్రమేనని కొనియాడారు. మాతృభూమిని కాపాడుకోవటానికి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రవాసభారతీయులపై ఉందన్నారు. ప్రతి ప్రవాస భారతీయుడు మాతృభూమి రుణం తీర్చుకోవడానికి, ఏపీని అభివృద్ధి పథంలోకి నడపటానికి 2024లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావటానికి ప్రయత్నించాలన్నారు.