ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పుడు 21 లక్షలు... ఇప్పుడు 3 కోట్ల పైమాటే! - సీజీఎస్టీ

హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్​లో పనిచేస్తున్న బొల్లినేని శ్రీనివాస గాంధీకి... ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. విస్తుపోయే రీతిలో ఆస్తులను గుర్తించారు.

cbi_rides_on_cgst_superindent_srinivasagandh_houses

By

Published : Jul 9, 2019, 9:12 PM IST

సీబీఐ అధికారుల వలకు.. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఉద్యోగి బొల్లినేని శ్రీనివాస గాంధీ చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై.. సీబీఐ సిబ్బంది హైదరాబాద్ తో పాటు.. విజయవాడలోనూ దాడులు చేశారు. కోట్లాది విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. పటమట, కంకిపాడు సబ్ రిజిష్ట్రార్ పరిధిలో ఇవి ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. గతంలో ఎన్స్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ లో గాంధీ పనిచేశారని అధికారులు తెలిపారు. 2010 కంటే ముందు ఆయన ఆస్తుల విలువ 21 లక్షల రూపాయలుండగా... ప్రస్తుతం 3 కోట్ల 74 లక్షల 14 వేల రూపాయల విలువ చేసే ఆస్తులు హైదరాబాద్, విజయవాడల్లో ఆయన బంధువుల పేర్లతో ఉన్నట్టు గుర్తించారు. శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సోదాలు కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details