ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లంచానికి ఆశపడ్డాడు.. అడ్డంగా దొరికిపోయాడు - అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్​ను పట్టుకున్న సీబీఐ

లంచం తీసుకుంటున్న అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పక్కా ప్లాన్​తో.. లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లంచానికి ఆశపడ్డాడు
లంచానికి ఆశపడ్డాడు

By

Published : Jun 16, 2022, 7:14 PM IST

లంచం తీసుకుంటున్న అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్) పున్నమల్లి బాపూజీని సీబీఐ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్(ఏ) కింది కేసు నమోదు చేసి.. బుధవారం విశాఖపట్నంలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు.

విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా)లో ఏడాది పాటు పారిశుద్ధ్య సేవల నిర్వహణ కాంట్రాక్టు హైదరాబాద్​కు చెందిన అల్ఫా సెక్యూరిటీ అండ్ అలయడ్ సర్వీసెస్ సంస్థకు దక్కింది. ఆ సంస్థ లేబర్ లైసెన్సు కోసం ఏప్రిల్ 23న శ్రమ సువిధ పోర్టల్​లో దరఖాస్తు చేసుకుంది. లైసెన్స్ ఇవ్వాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని పున్నమల్లి బాపూజీ డిమాండ్ చేశారు. దాంతో అల్ఫా సెక్యూరిటీ సిబ్బంది సీబీఐని అశ్రయించారు. సీబీఐ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగి.. బాధితుడి నుంచి బాపూజీ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details