viveka murder case: శివశంకర్‌రెడ్డిని నార్కో పరీక్షలకు అనుమతివ్వాలి: కడప కోర్టులో సీబీఐ పిటిషన్ - వివేకా హత్యకేసు తాజా వార్తలు

13:49 December 21
సాయంత్రం లోపు బెయిల్‌పై తీర్పు వెలువరించనున్న కడప కోర్టు
viveka murder case: వివేకా హత్యకేసుకు సంబంధించి.. కడప జిల్లా పులివెందుల కోర్టులో.. సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని పిటిషన్లో పేర్కొంది. సీబీఐ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. త్వరలోనే శివశంకర్‌రెడ్డి సమ్మతి కోరనుంది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ల బెయిల్ తీర్పును.. కడప కోర్టు నేడు సాయంత్రంలోగా వెలువరించనుంది.
ఇదీ చదవండి:CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్