జగన్ అక్రమాస్తుల కేసుల ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఛార్జ్‌షీట్లపై విచారణ జరుపుతామని ఈనెల 11న కోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్తామన్న జగన్ తరఫు న్యాయవాది..అప్పీల్‌కు సమయం కోరారు. అరబిందో, హెటిరో కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరిన జగన్..తన బదులు మరొకరు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. జగన్ అభ్యర్థనపై కౌంటర్ దాఖలుకు ఈడీ గడువు కోరింది.
జగన్ అక్రమాస్తుల కేసు:ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టులో విచారణ - జగన్ అక్రమాస్తుల కేసు
జగన్ అక్రమాస్తుల కేసుల ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈడీ చార్జ్షీట్లపై విచారణ జురుపుతామన్న కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్తామన్న జగన్ తరఫు న్యాయవాది..అప్పీల్‌కు సమయం కోరారు.
జగన్ అక్రమాస్తుల కేసు
అరబిందో, హెటిరో ఈడీ కేసు నుంచి బీపీ ఆచార్యను ఇటీవల హెకోర్టు తొలగించగా..హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఈడీ అప్పీల్ దాఖలు చేసింది. అనంతరం ఈడీ కేసుల విచారణ సీబీఐ, ఈడీ కోర్టు ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.
ఇదీచదవండి: స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు