ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు: రఘురాం సిమెంట్స్ ఛార్జిషీట్‌పై ఈనెల 29కి విచారణ వాయిదా - జగన్ కేసులో విచారణ

జగన్ అక్రమాస్తుల కేసుల్లో రఘురాం సిమెంట్స్ ఛార్జ్​షీట్​పై విచారణ జరిగింది. రఘురాం సిమెంట్స్, జగన్మోహన్ రెడ్డిపై అభియోగాల నమోదుపై న్యాయవాదులు వాదించారు. మిగతా వాదనల కోసం న్యాయస్థానం విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు
జగన్ అక్రమాస్తుల కేసు

By

Published : Jan 25, 2021, 10:33 PM IST

జగన్ అక్రమాస్తుల కేసులో రఘురాం సిమెంట్స్ ఛార్జ్​షీట్​పై హైదరాబాద్‌ సీబీఐ న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. రఘురాం సిమెంట్స్, జగన్మోహన్ రెడ్డిపై అభియోగాల నమోదుకై న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఓబుళాపురం గనుల అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. ఓఎంసీ కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ శ్రీలక్ష్మి ఇటీవల డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ గడువు కోరడంతో కేసు విచారణను ఈనెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇదీచదవండి:జగన్ అక్రమాస్తుల కేసు:ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details