ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cm jagan జగన్‌ అక్రమ ఆస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ - సీబీఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు(cm jagan illegal property case)కు సంబంధించి సీబీఐ(cbi) కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని సీఎం జగన్ సహా పలువురిని ధర్మాసనం అదేశించింది.

CM JAGAN ILLEGAL PROPERTY CASE
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

By

Published : Jul 26, 2021, 9:40 PM IST

వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల(cm jagan illegal property case)పై సీబీఐ(cbi), ఈడీ కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని జగన్ సహా పలువురికి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. అరబిందో హెటిరో కేసు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య, అరబిందో ఫార్మసీ ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ఎండీ శరత్ చంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, విశ్రాంత అధికారులు శామ్యూల్, బీపీ ఆచార్య వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details