ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌ పిటిషన్‌ - సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌ పిటిషన్‌ వార్తలు

హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్
హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్

By

Published : Feb 23, 2022, 3:31 PM IST

Updated : Feb 23, 2022, 5:02 PM IST

15:29 February 23

హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్

కడప పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్​సింగ్​పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై కడప పోలీసులు నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని కోరుతూ రామ్ సింగ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఉదయ్ కుమార్​ను ఏఎస్పీ బెదిరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.

కేసు నేపథ్యం ఏంటంటే..

వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తనను సీబీఐ ఏఎస్పీ రామ్​సింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి కడప కోర్టును ఆశ్రయించారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు రామ్​సింగ్​పై 195ఏ, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును సవాల్ చేస్తూ ఏఎస్పీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రామ్ సింగ్ వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నాడు.

ఇదీ చదవండి

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Last Updated : Feb 23, 2022, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details