సీబీఐ - ఈడీ న్యాయస్థానంలో... జగన్ అక్రమాస్తుల కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్‌కు సంబంధించి.. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐ కేసుతో సంబంధం లేకుండా విచారణ జరపాలని ఈడీ వాదించింది.
ఈ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్లలోని నిందితులందరి వాదనలు వినాలని న్యాయస్థానం నిర్ణయించింది. గాలి జనార్దన్‌రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. మరోవైపు... ఎంఆర్ విల్లాల అక్రమాల కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌పై వాదనలు విన్న కోర్టు... ఈ నెల 19కి విచారణ వాయిదా వేసింది. ఓఎంసీ కేసు విచారణ ఈనెల 16కి వాయిదా పడింది.