ఎగువ నుంచి వస్తున్న వరద నీటిలో ప్రకాశం బ్యారేజీ వద్దకు పశువులు కొట్టుకువస్తున్నాయి. నది ఒడ్డున మేతకు వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతిలో దాదాపు పదికి పైగా గేదెలు బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చాయి. పశువులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్యారేజీ గేట్ల నుంచి దిగువకు పడిన గేదెలు వరద ప్రవాహంలోనూ ఈదుతూ కనిపించాయి. వరద ఉద్ధృతికి పశువులు ప్రవాహంలో ముందుకు వెళ్లిపోయాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పశువులను కాపాడేందుకు గాలింపుచేపట్టాయి.
వరద ప్రవాహంలో చిక్కుకున్న మూగజీవాలు
కృష్ణా నది వరద నీటిలో పశువులు చిక్కుకున్నాయి. నది ఒడ్డుకు మేతకు వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పశువులు వరద నీటిలో ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చాయి. బ్యారేజీ గేట్ల నుంచి దిగువకు కొట్టుకుపోయాయి. పశువులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
వరద ప్రవాహంలో చిక్కుకున్న మూగజీవాలు