రాష్ట్రంలో కరోనా కొత్త రకం స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు స్ట్రెయిన్ ఉన్నట్లు తేలిందని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. సీసీఎంబీ, ఎన్ఐవీ నివేదికల్లో ఈ విషయం వెల్లడైందని ఆయన తెలిపారు. యూకే నుంచి తిరిగి వచ్చిన వారి వల్ల కరోనా వైరస్‌కు చెందిన ఈ కొత్త స్ట్రెయిన్ విస్తరించినట్లు ఎలాంటి దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు స్ట్రెయిన్ నిర్ధరణ - ఏపీలో యూకే స్ట్రెయిన్ కేసుల తాజా వివరాలు

రాజమహేంద్రవరం మహిళకు యూకే స్ట్రెయిన్
16:24 December 29
రాజమహేంద్రవరం మహిళకు స్ట్రెయిన్
యూకే నుంచి రాజమహేంద్రవరానికి తిరిగి వచ్చిన మహిళ కుమారుడికి నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యిందని వెల్లడించారు. ఆమె నుంచి మరెవరికీ కరోనా సోకలేదని తెలిపారు. ఆమె సంబంధీకులకు కూడా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించామని అన్నారు. అందరికీ నెగెటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని..ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇదీచదవండి
Last Updated : Dec 29, 2020, 5:54 PM IST