కరోనా మహమ్మారి రైతుల పాలిట శాపంగా మారింది. ఒకప్పుడు వేలల్లో జరిగే వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదని కూరగాయల రైతులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా పంటను అమ్ముకోలేక పోతున్నామని వాపోతున్నారు. ఒక్కోసారి అమ్మకాలు లేక కూరగాయలు పడేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన రైతుబజార్లో వినియోగదారులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
కరోనా మంట... అమ్ముడుపోని పంట - కూరగాయల రైతులపై కరోనా ప్రభావం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూరగాయల రైతులు కష్టాలు పడుతున్నారు. పంట అమ్ముడు పోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా మంట.. అమ్ముడవని పంట