అంతకంతకూ పడగ విప్పుతున్న కరోనా … వేడుకల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్ అమలు, భౌతిక దూరం పాటించాలన్న సూచనలతో కల్యాణ మండపాలు, బాంక్వెట్ హాల్స్ అన్నీ మూతపడ్డాయి. ముందుగా బుక్ చేసుకున్న వారు అర్థంతరంగా కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. పెద్దఎత్తున జరగాల్సిన పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ప్రారంభోత్సవాలు ఆగిపోయాయి. ఈ నెలలో జరగాల్సిన 3 వేల వరకూ పెళ్లిళ్లు వాయిదాపడినట్టు కల్యాణ మండపాల నిర్వాహకులు అంచనా వేశారు.
పెళ్లి అంటే వందల మందికి పని దొరుకుతుంది. ఫంక్షన్ హాల్ యజమానులు, ఫొటో, వీడియో గ్రాఫర్స్, పెళ్లి పందిరి వేసేవారు, టెంట్లు, అలంకరణ, బ్యాండ్‌మేళా.. ప్రతి ఒక్కరికీ చేతి నిండా పని ఉంటుంది. ఇప్పుడు కరోనా కారణంగా... సీజన్ వేళ తమకు ఉపాధి దక్కని పరిస్థితి నెలకొందని శుభకార్యాలపై ఆధారపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు ప్రధానంగా పెళ్లిళ్లు జరిపించే పూజారులకూ ఉపాధి కరవైంది. అక్టోబరు 17 తర్వాతే మంచి ముహుర్తాలు ఉన్నా అవి కూడా తక్కువే అయినందున ఈ ఏడాది వేడుకలపై ఆధారపడిన అన్ని రంగాల వారూ తీవ్రంగా నష్టపోతున్నారు.
నష్టపోతున్న ఈవెంట్స్ నిర్వాహకులు