cardio theaters: కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా ఉండే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే ఆపరేషన్ థియేటర్లను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు . 8 మాడ్యులర్ థియేటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి థియేటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు సైతం జరుగుతాయని వివరించారు. పేదలు ఇకపై ఓపెన్ హార్ట్ సర్జరీలకు కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు . మార్చి 4 నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండ్ డా.కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ శివశంకర్, సబ్ కలెక్టర్ పాల్గొన్నారు.
government hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం - cardio operation theaters ceremony in vijayawada
cardio theaters: పేదలు ఇకమీదట ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా ప్రారంభించారు.
ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం