విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో అన్ని రకాల స్పెషలిస్ట్ విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచిందని, కోవిడ్ కారణంగా అన్ని విభాగాలను ప్రారంభించలేకపోతున్నామని ఆయన తెలిపారు. పీపీపీ పద్ధతిలో సేఫ్ న్యూట్రయన్స్, ప్రభుత్వం సంయుక్తంగా కార్డియాక్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం క్యాత్ ల్యాబ్ అడ్వాన్స్ సిస్టమ్‌ను... తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడలో మాత్రమే ఉందన్నారు. ఇక్కడ ఎలక్ట్రో ఫిజియాలజీ సిస్టం ఏర్పాటు చేశారని... ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్డియాక్ సెంటర్‌ను అభివృద్ధి చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభం - విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్డియాక్ సెంటర్‌ను అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభం