ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రూ. 2150 కోట్ల పెట్టుబడితో మొబైల్స్ తయారీ యూనిట్లు !

ఏపీలో రూ. 2150 కోట్ల పెట్టుబడితో మొబైల్స్ తయారీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ఆసక్తిగా ఉన్నట్లు కార్బన్ మొబైల్స్ సంస్థ ప్రతినిధులు సీఎం జగన్​కు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో సహా సెట్​టాప్ బాక్సులు, టెలికాం ఉత్పత్తులు, చార్జర్లు, మొబైల్ ఫోన్ల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్ వేర్, ల్యాప్​టాప్, డెస్క్​టాప్ లను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు.

Carbon Mobiles Director Meet CM jagan
రాష్ట్రంలో రూ. 2150 కోట్ల పెట్టుబడితో మొబైల్స్ తయారీ యూనిట్లు

By

Published : Jul 29, 2021, 8:22 PM IST

ఏపీలో రూ. 2150 కోట్ల పెట్టుబడితో మొబైల్స్ తయారీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ఆసక్తిగా ఉన్నట్లు కార్బన్ మొబైల్స్ సంస్థ ప్రతినిధులు సీఎం జగన్​కు తెలియజేశారు. తిరుపతితో పాటు కడప జిల్లా కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్​లో మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో యూనైటెడ్ టెలీలింక్స్ నియోంక్ ప్రైవేట్ లిమిటెడ్(కార్బన్) సంస్థ ప్రతినిధులు ఈమేరకు సీఎం జగన్​తో భేటీ అయ్యారు. 650 కోట్లతో మొబైల్స్ తయారీ, ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు రూ.1500 కోట్లతో ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. దీని వల్ల 6 వేల మందికి ప్రత్యక్షంగా 15 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో సహా సెట్​టాప్ బాక్సులు, టెలికాం ఉత్పత్తులు, చార్జర్లు, మొబైల్ ఫోన్ల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్ వేర్, ల్యాప్​టాప్, డెస్క్​టాప్ లను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి జగన్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details