విజయవాడ నగర శివారు నున్న బైపాస్ రోడ్డులో.. మట్టి టిప్పర్ లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు లారీని వేగంగా ఢీకొట్టటంతో.. కారు లారీ కిందకు దూసుకుపోయింది.
టిప్పర్ని ఢీ కొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు - car hits tipper lorry recent news
విజయవాడ నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. లారీని కారు ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది.
టిప్పర్ లారీని ఢీ కొట్టిన కారు
గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులు కండ్రికకు చెందిన గండికోట దుర్గారావు, నర్సింహరావుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులిద్దరినీ ఆసుపత్రికి తరలించామనీ.. ఘటనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 26న ఆందోళనలు