ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మేడ్చల్ : బౌరంపేటలో ప్రమాదం...ముగ్గురు ఏపీ వాసులు దుర్మరణం - dundigal latest news

మద్యం మత్తులో వేగంగా కా
మద్యం మత్తులో వేగంగా కా

By

Published : Dec 12, 2021, 8:18 AM IST

Updated : Dec 12, 2021, 10:26 AM IST

08:15 December 12

మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టిన యువకులు

Dundigal Car Accident : తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేన్‌ పరిధిలోని బౌరంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన అశోక్‌ అనే వ్యక్తిని సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

Car Hits Lorry at Dundigal : మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, విజయవాడ వాసులు చరణ్, సంజూ, గణేశ్‌గా గుర్తించారు. ఈ యువకులు నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో చరణ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. నలుగురు యువకులు మద్యం తాగి ఉన్నట్లు తెలిపారు. గాయపడిన అశోక్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

ఇవీచదవండి.

Last Updated : Dec 12, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details