పోలవరం ప్రాజెక్టులో ప్రధాన ఆనకట్ట ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం కంటే ముందే నిర్మించే కాపర్ డ్యామ్‌లు తాత్కాలిక రిజర్వాయర్లుగా మారనున్నాయి. ఎగువ కాపర్ డ్యామ్‌ను నదీ గర్భంలోంచి 42.5 మీటర్ల ఎత్తున నిర్మించాలని నిర్ణయించారు. నదీ ప్రవాహ మార్గంలో నిర్మిస్తున్న ఈ కాపర్ డ్యామ్ తాత్కాలిక ఆనకట్ట పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. దాదాపు 76 లక్షల క్యూబిక్ మీటర్ల పనుల్లో 38 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, రాళ్లను ఆ ప్రాంతంలో పరిచారు. గోదావరి నది కుడి, ఎడమ గట్టుల వైపు నుంచి కొంతమేర ఖాళీ ఇచ్చి కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని నదిగర్భంలో సమాంతరంగా చేపట్టారు. అయితే ఈ నిర్మాణం కారణంగా దాదాపు 23 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.
తాత్కాలిక రిజర్వాయర్లుగా పోలవరం కాపర్ డ్యామ్‌లు - polavaram
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టులో నిర్మించే తాత్కాలిక మట్టికట్ట ఓ తాత్కాలిక రిజర్వాయర్లా మారిపోనుంది. ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు మరో ఏడాది పట్టనుండటంతో ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని వేగవతం చేశారు.
తాత్కాలిక రిజర్వాయర్లుగా పోలవరం కాపర్ డ్యామ్‌లు