ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రపంచ క్యాన్సర్ దినం... విజయవాడలో 3కే వాక్​థాన్... - ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా

ప్రపంచ క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకుని...అమెరికన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆధ్వర్యంలో విజయవాడలో 3కే వాక్​థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా పాల్గొన్నారు.

Cancer Day Awareness in vijayawada
విజయవాడలో 3కే వాక్​థాన్

By

Published : Feb 4, 2020, 1:38 PM IST

ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందని... ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్​లో నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకుని... విజయవాడలోని నిర్వహించిన 3కే వాకథాన్​ను రోజా జెండా ఊపి ప్రారంభించారు. అమెరికన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, బొమ్మిడాల క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో వివిధ కళాశాల విద్యార్థినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి ప్రారంభమైన 3కే వాకథాన్ బందర్ రోడ్డు మీదుగా సాగింది. క్యాన్సర్​ను ముందుగా గుర్తించడంతోపాటు.... ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అమెరికన్ ఆంకాలజీ వైద్య నిపుణుడు సుబ్బారావు వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థినులకు ఈ అవగాహన కల్పించడం వల్ల....వారి ద్వారా గ్రామాల్లోని ప్రజలకు క్యాన్సర్ గురించి తెలిపేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

విజయవాడలో 3కే వాక్​థాన్

ABOUT THE AUTHOR

...view details