ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేతనాలు చెల్లించాలని రోడ్డెక్కిన కాల్​ సెంటర్​ ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కాల్‌సెంటర్లలో విధులు నిర్వహిస్తున్నా... తమకు నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 1902, 1400, 14500 కాల్‌సెంటర్లలో పనిచేస్తోన్న సుమారు ఆరు వందల మంది రోడ్డెక్కారు.

call center employees agitaion for salaries in krishna district
call center employees agitaion for salaries in krishna district

By

Published : Aug 31, 2020, 3:37 PM IST

కార్వే సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కాల్​ సెంటర్లలో పని చేస్తున్నామని.... వేతనాల కోసం ఎవరిని సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేయాలనుకున్నారు. కలెక్టరు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. తమకు వేతనాలతోపాటు పీఎఫ్‌ కూడా ఖాతాల్లో జమ కావడం లేదని- వీటిపై ముఖ్యమంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details