విజయవాడలో.. సిక్కుల సంప్రదాయ వేడుక బైసాఖీ.. వైభవంగా జరిగింది. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
విజయవాడలో వైభవంగా బైసాఖీ
By
Published : Apr 13, 2019, 11:29 PM IST
విజయవాడలో వైభవంగా బైసాఖీ
సిక్కుల సంప్రదాయ పండగ బైసాఖీ వేడుకలను విజయవాడ, అమరావతి సాంస్కృతిక కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటించాలని చాటుతూ ప్రదర్శనలు నిర్వహించారు. కట్టు, బొట్టు విషయంలో ప్రత్యేకంగా ఉండే సిక్కులు... సంప్రదాయం చాటుతూ చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చప్పట్లు కొట్టించాయి. నగరంలో స్థిరపడిన సిక్కులంతా ఒకచోట చేరి సంప్రదాయ పండుగను వైభవంగా నిర్వహించారు.