ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

viral video స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ గుండెపోటుతో వ్యాపారి మృతి - Independence day celebrations

viral video గ్రేటర్ హైదరాబాద్ కాప్రా పరిధిలోని వంపుగూడ లక్ష్మి విల్లాస్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జెండా వందనం అనంతరం ప్రసంగిస్తూ ఓ వ్యాపారి గుండెపోటుతో చనిపోయారు

died
died

By

Published : Aug 15, 2022, 4:12 PM IST

viral video: తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ కాప్రా పరిధిలో గల వంపుగూడ "లక్ష్మి విల్లాస్"లో ఉప్పల సురేష్(56) అనే వ్యాపారి జెండా వందనంలో పాల్గొని ప్రసంగిస్తూ హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. లక్ష్మి విల్లాస్​లో ఉదయం జెండా వందనం అనంతరం ప్రసంగిస్తుండగా మాట్లాడుతూనే చనిపోయారు. ఈ పరిణామంతో కాప్రాలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. అరుదైన ఈ మృతి పట్ల వంపుగూడలో అందరూ విస్మయం చెందారు.

మృతుడు ఉప్పల సురేష్ బాగ్ అంబర్​పేట డి.డి కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. మృతి సమాచారం అందుకున్న పలువురు ప్రముఖులు నివాళులర్పించి ఆయన సతీమణి కరుణను పరామర్శించారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన కళ్ల ముందే కొడుకు మృతి చెందటం చాలా బాధాకరం అని తండ్రి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details