ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రయాణికులతో రద్దీగా మారుతున్న బస్టాండ్‌లు

ఆర్టీసీ బస్సుల్లో రద్దీ క్రమంగా పెరుగుతోంది. విద్యాసంస్థల ప్రారంభం, అంతర్రాష్ట్ర సర్వీసుల మొదలుతో... ప్రయాణికులు బస్టాండ్ల బాట పడుతున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు, కరెంట్‌ రిజర్వేషన్‌ వంటి సదుపాయాలను ఆర్టీసీ కల్పిస్తోంది. రద్దీ పెరుగుతుండటంతో ఆదాయమూ వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Bus stands becoming crowded with passengers
ప్రయాణికులతో రద్దీగా మారుతున్న బస్టాండ్‌లు

By

Published : Nov 5, 2020, 4:55 AM IST

ప్రయాణికులతో రద్దీగా మారుతున్న బస్టాండ్‌లు

నవంబర్ 2న రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోవడం, అదే రోజున తెలంగాణకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కావడం ఏపీఎస్​ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది. కొన్ని నెలలుగా అంతంతమాత్ర ఆదాయంతో చక్రాలీడుస్తున్న సంస్థకు క్రమంగా రాబడి పెరుగుతోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో బస్టాండ్లలో రద్దీ కనిపిస్తోంది. రాష్ట్రంలోనే పెద్దదైన విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ప్రయాణికులతో కళకళలాడుతోంది.

సాధారణంగా విజయవాడ నుంచి రోజూ 3 వేలకు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. తెలుగురాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదరడంతో వీటిలో చాలా వరకూ సర్వీసులను పునరుద్ధరించారు. బస్టాండ్లకు వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించామని అధికారులు చెబుతున్నారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామంటున్నారు.

విజయవాడలో వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో సిటీ బస్సుల్లోనూ ప్రయాణాలు పెరిగాయి. నగరంలో 50 శాతం సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సంస్థకు ఆదాయమూ బాగానే వస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సులు, బస్టాండ్లలోనూ కరోనా నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. కరవు భత్యం పెంపు

ABOUT THE AUTHOR

...view details