ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BUS ACCIDENT : బస్సు - లారీ ఢీ... విద్యార్థులకు గాయాలు - tummalapalem

కృష్ణా జిల్లా తుమ్మలపాలెం వద్ద కళాశాల బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

కళాశాల బస్సు, లారీ ఢీ
కళాశాల బస్సు, లారీ ఢీ

By

Published : Jan 20, 2022, 12:44 PM IST

విజయవాడ సమీపంలోని తుమ్మలపాలెం వద్ద కళాశాల బస్సు లారీని వేగంగా ఢీ కొట్టింది. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద కారును తప్పించబోయి లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. లారీ వెనుకనే ఎంవీఆర్ కళాశాల బస్సు లారీని బలంగా ఢీ కొంది. బస్సు డ్రైవర్ వెనుకవైపునున్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details