bus charges will decrease : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులతో పాటు, పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలతో పోటీపడేందుకు వీలుగా ఏపీఎస్‌ఆర్టీసీ ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో మంగళవారం నుంచే వీటిని అమలుచేయడం ఆరంభించారు. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు నడిచే కొన్ని సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించారు. ఏసీ బస్సులతోపాటు, దూర ప్రాంత ఇతర సర్వీసుల్లో సైతం పరిస్థితిని బట్టి 10-20 శాతం ఛార్జీలు తగ్గించుకునేందుకు వీలుగా 2016లో యాజమాన్యం ఉత్తర్వులిచ్చింది. అయితే అప్పటి నుంచి దీనిని అమలు చేయడం లేదు. తాజాగా ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మంగళవారం అన్ని జోన్ల ఈడీలు, అన్ని జిల్లాల ఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 20 శాతం వరకు ఛార్జీలు తగ్గించేందుకు వీలుగా గతంలో ఉన్న ఉత్తర్వులను అమలు చేసేందుకు జిల్లాల్లో రీజనల్ మేనేజర్లు నిర్ణయం తీసుకోవచ్చని ఆదేశించారు. దీంతో ఓఆర్ తక్కువగా ఉండే పలు రూట్లలో ఎంపిక చేసిన ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నారు. వారాంతం, పీక్ అవర్స్‌లో వెళ్లే సర్వీసుల్లో ప్రస్తుత ఛార్జీయే ఉంటుందని, మిగిలిన రోజులు, పీక్ అవర్స్ కాని సమయంలో బయలుదేరే సర్వీసుల్లో ఛార్జీలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
అతి తక్కువ ఓఆర్ కారణం..