ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bullettu bandi: డుగ్గు.. డుగ్గు పాటను కొత్తగా పాడిన ఉపాధ్యాయుడు

By

Published : Sep 6, 2021, 7:08 AM IST

సామాజిక మాధ్యమాల్లో బుల్లెట్టు బండి(Bullettu bandi) మేనియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత యూట్యూబ్‌లో(youtube) విడుదలైన ఈ పాటకు మంచి ఆదరణ వచ్చింది. ఆ తర్వాత ఓ నవవధువు డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ పాట వింటే చాలు చిన్నా... పెద్దా తేడా లేకుండా స్టెప్పులేస్తారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇదే ట్రెండ్‌ను ఓ తెలుగు ఉపాధ్యాయుడు క్యాచ్ చేశారు. అందరినీ ఆకర్షిస్తున్న సంగీతంతో డుగ్గు.. డుగ్గు పాఠశాల పాటను ఆలపించారు. ప్రస్తుతం ఆ పాట కూడా సోషల్ మీడియాలో(Social media) వైరల్‌గా(viral) మారింది.

డుగ్గు.. డుగ్గు పాటను కొత్తగా పాడిన ఉపాధ్యాయుడు
డుగ్గు.. డుగ్గు పాటను కొత్తగా పాడిన ఉపాధ్యాయుడు

డుగ్గు.. డుగ్గు పాటను కొత్తగా పాడిన ఉపాధ్యాయుడు

ఇటీవలి కాలంలో బాగా వైరల్‌ అవుతున్న పాట బుల్లెట్టు బండి(Bullettu bandi). ఈ పాట మొదట యూట్యూబ్‌లో(youtube) విడుదలై మంచి ఆదరణ పొందింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాట చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా భోంరాస్‌పేట మండలం దుద్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు సుధాకర్‌.... ఈ పాటతోనే విద్యార్థులను పాఠశాలలకు రప్పించాలని భావించారు.

బుల్లెట్టు బండి పాట సంగీతానికి అనుగుణంగా... పిల్లలు బడికి రావడానికి ప్రోత్సహించేలా లిరిక్స్ రచించారు. అంతేకాకుండా ఆ సంగీతానికి తగిన స్వరంతో పాటను ఆలపించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతోమంది తమ ప్రతిభను కనబర్చుతారు. అయితే ట్రెండ్‌కు తగ్గట్టు... విద్యార్థులు బడికి హాజరవడాన్ని ప్రోత్సహించేలా ఈ తెలుగు ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది(viral song). సామాజిక మాధ్యమాల్లో(social media) హల్‌చల్ చేస్తోంది. డుగ్గు.. డుగ్గు... పాఠశాల పాటను మీరూ ఓసారి వినండి మరి..!

ఇదీ చదవండి:రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకం

ABOUT THE AUTHOR

...view details