లాక్‌డౌన్ వల్ల పని లేక కుటుంబంతో సహా పస్తులు ఉండాల్సి వస్తోందని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు తదితర పట్టణాల్లో పనులు ఆగిపోవటం వల్ల ఉపాధి కోల్పోయామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోవట్లేదని, ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
మమ్మల్ని ఆదుకోండి..ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికుల మొర - ఏపీలో భవన నిర్మాణ కార్మికుల వార్తలు
లాక్‌డౌన్ వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ముఖ్య పట్టణ కేంద్రాల్లో పనులు ఆగిపోయాయని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వ సాయం సరిపోక పస్తులు ఉండాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
building-workers-problems-in-ap