భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయవద్దని.. ముఖ్యమంత్రి ఇచ్చినట్టు చెబుతున్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడలోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి యత్నించిన కార్మిక సంఘాలను అడ్డుకుని పోలీసులు నిలువరించారు. గతంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేవారని.. వాటిని ఆపేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహారావు డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు.
మంత్రి వెల్లంపల్లి ఇంటి ముట్టడికి భవన నిర్మాణ కార్మిక సంఘాల యత్నం - Building Construction Workers latest news
విజయవాడలో భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి యత్నించిన కార్మిక సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.

విజయవాడలో భవన నిర్మాణ కార్మిక సంఘాల నిరసన