భవన నిర్మాణ రంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుభాష్ చంద్రబోస్ అన్నారు. నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా.. ఈ నెల 9న ఒక్కరోజు విరామం ప్రకటించినట్లు చంద్రబోస్ వెల్లడించారు. క్రెడాయ్, నేరాడ్కో, చాంబర్ ఆఫ్ కామర్స్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలన్నీ ఈ విరామంలో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు.
'నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఒక్కరోజు విరామం' - సతమతమవుతుందన్న భవన నిర్మాణ రంగం
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఉంది.. భవన నిర్మాణ రంగ పరిస్థితి. కరోనా కారణంగా నత్తనడకన నడుస్తున్న ఈ రంగాన్ని.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 9న ఒక్కరోజు విరామం ప్రకటించినట్లు క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు.
కరోనా కారణంగా భవన నిర్మాణ రంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని.. కార్మికుల వలస కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయిపోయిందని సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముడి సరుకు లేనా స్టీల్, సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈ భారం అంతిమంగా కొనుగోలు ధరపై ప్రభావం చూపుతోందన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టిసారించి ధరల పెరుగుదలను నియంత్రించాలని కోరారు. ఈ సమావేశంలో క్రెడాయ్ విజయనగరం ఛైర్మన్ వి. పార్థసారథి, అధ్యక్షులు సీహెచ్ సూర్యనారాయణ రాజు, కార్యదర్శి కె. రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదంవడి:
construction traders: పవర్ హాలిడేపై... నిర్మాణ రంగ వ్యాపారులతో ముఖాముఖి