దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన.. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్.కె.సింగ్‌ను కలవనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ఈసీ ఛైర్మన్ సంజయ్ మల్హోత్రాతో భేటీ అవుతారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో బేటీకి బుగ్గన సమయం కోరారు. రేపు కేంద్ర జలశక్తి, పౌర విమానయాన శాఖల కార్యదర్శులను కలవనున్నారు. ఆ తర్వాత విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌తో మంత్రి భేటీ అవుతారు.